సీతారాముడి షష్ఠి
కొన్ని రోజుల క్రితం సిరివెన్నెలకు అరవై నిండాయట. ఊహలకు వయసుమైలురాళ్ళేంటో,పూల తోట లో గడియారం ముళ్ళ బాటలా. ఏది ఏమైనా, ఇది ఒక మజిలీ అని ప్రపంచం కోకిలై కూస్తుంది గనక, నావి కొన్ని జ్ఞాపకాలు. రాంగోపాల్ వర్మ ద్వారా నేను సీతరామ శాస్త్రి ప్రైవెట్ (అంటే అప్పటికి సినిమాల్లో రాని) పాటలకు అభిమానిని. వాటిలో కొన్ని తర్వాత సినిమాల్లో బలంగా చొరబడ్డాయి: 'సురజ్యమవలేని', 'నిగ్గదీసి అడుగు', 'జగమంత కుటుంబం'. పోయెట్రీ కీ సయెన్స్ కీ చుక్కెదురని కొందరి అపోహ; డ్రామా కి లాజిక్ కి పడదని కొందరు దర్శకులు అ