కలం చేరిన కుంచె
బాపు గారి గొంతు మూడున్నర సంవత్సరాల క్రితం మూగవోయింది. రమణ గారి దృష్టి నిన్న కనుమరుగైంది. తెలుగు వారి గుండె బరువైంది.
కాని బాపూ గారు, మీరు లేరనే విచారం కంటే మీరు తెలుగింట పుట్టారు, మాకాలం లోవున్నారు అన్న కృతజ్ఞతా భావమే ఎక్కువుంది. ఎనలేని కృతజ్ఞత -- మా కళ్ళకు ఒక అందమైన ప్రపంచాన్ని చూపినందుకు -- అసలు అందాన్ని చూపినందుకు -- ఎన్నో శుక్రవారాలు తెలుగు సినిమాలయాల ముంగిట ముత్యాల ముగ్గులు వేసినందుకు. Thank you.
(మీ అందాల ముగ్గును రెండు కన్నీటిబొట్ల కళ్ళాపితో కొంచుం చెరిపితే క్షమించండి).