సీతారాముడి షష్ఠి

కొన్ని రోజుల క్రితం సిరివెన్నెలకు అరవై నిండాయట. ఊహలకు వయసుమైలురాళ్ళేంటో,పూల తోట లో గడియారం ముళ్ళ బాటలా.

ఏది ఏమైనా, ఇది ఒక మజిలీ అని ప్రపంచం కోకిలై కూస్తుంది గనక, నావి కొన్ని జ్ఞాపకాలు. రాంగోపాల్ వర్మ ద్వారా నేను సీతరామ శాస్త్రి ప్రైవెట్ (అంటే అప్పటికి సినిమాల్లో రాని) పాటలకు అభిమానిని. వాటిలో కొన్ని తర్వాత సినిమాల్లో బలంగా చొరబడ్డాయి: 'సురజ్యమవలేని', 'నిగ్గదీసి అడుగు', 'జగమంత కుటుంబం'.

పోయెట్రీ కీ సయెన్స్ కీ చుక్కెదురని కొందరి అపోహ; డ్రామా కి లాజిక్ కి పడదని కొందరు దర్శకులు అణువుగా నమ్మినట్టు. సయెన్స్ ని నిశ్సంకోచంగా, ఆత్మీయంగా ఎంబ్రేస్ చసుకున్న వాడు సీతరామ శాస్త్రి. ఆంగ్లాన్ని కూడా. తనది టెలికమ్యూనికేషన్స్ గురించి అక పాట వుంది, 'దూర శ్రవణ యంత్రం': మేము మొదటి సారి కలుసుకున్నప్పుడు పాడాడు, 25 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ మర్చిపోలేను; నాకదొక మైలు రాయి. 'శూన్యంలో సేద్యం చేసి, సమాచార సశ్యం పండించి...' ఒక సేటెలైట్ గురించి ఇంత పోయెటిక్ గా చెప్పొచ్చా!

తర్వాత నేను 'లిటిల్ సోల్జర్స్' స్క్రిప్ట్ మొదలు పెట్టినప్పుడు తన దస్తూరీ తో తన పాటే ఒకటి వ్రాయించుకుని మొదటి పేజ్ గా పెట్టుకున్నా; ఉత్తేజ పరచటానికి. 'ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఒటమి...' (పట్టుదల సినిమా లోది). ఆ సినిమా తీయటానికి పట్టినన్ని సంవత్సరాలలో, ఒడుదుడుకులలో, నిరుత్సాహపడకుండా నిలదొక్కుకునేలా చేసింది.

సియారాం సిరి సిరా చిమ్ముతూ ఇంకా ఎన్నో వసంతాలాడుకోవాలని నా కోరిక.

Featured Posts
Posts are coming soon
Stay tuned...
Recent Posts
Archive
Search By Tags
Follow Us
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square